ప్రేమికుల దినోత్సవం రోజునే బన్నీ సినిమా లాంచ్
- ఫిబ్రవరి 14వ తేదీన లాంచ్
- కథానాయికగా కైరా అద్వాని
- దసరాకి విడుదల చేయాలనే ఆలోచన
వేలంటైన్స్ డే సందర్భాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 14వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయట. ఆ వెంటనే రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టేసి, దసరాకి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు త్రివిక్రమ్ .. బన్నీ కాంబినేషన్లో 'జులాయి' .. 'సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలు వచ్చాయి. ఆ రెండింటిని మించి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని బన్నీ ముందుగానే త్రివిక్రమ్ కి చెప్పేశాడట. ఈ సినిమాలో కథానాయికగా కైరా అద్వానిని తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది.