టీమిండియా ఆశలకు వర్షం అడ్డుకట్ట.. ప్రారంభం కాని మ్యాచ్
- ఐదో రోజు ఒక్క బంతి కూడా పడని వైనం
- మరికాసేపట్లో పిచ్ పరిశీలన
- మ్యాచ్ రద్దు అయినా సిరీస్ భారత్‌దే
కాగా, నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా వికెట్ నష్టపోకుండా ఆరు పరుగులు చేసింది. భారత్ కంటే 316 పరుగులు వెనకబడి ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 622/7 వద్ద డిక్లేర్ చేసింది. ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌట్ అవడంతో ఫాలో ఆన్ ఆడుతోంది. దీంతో ఆసీస్ పరాజయం తప్పదని భావించారు. అయితే, వరుణుడు ఆటంకం కలిగించడంతో మ్యాచ్ జరగడంపై సందేహాలు నెలకొన్నాయి. మ్యాచ్ రద్దయినా 2-1తో సిరీస్ భారత్ సొంతమవుతుంది.