Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఎన్ని అంటున్నా కామ్ గా ఉన్నామనేనా?: బాలయ్యపై నాగబాబు మరో కామెంట్

  • హీరోలను తయారు చేసేది ప్రేక్షకులే
  • మాకు మేమే హీరోలం అనడం ఏంటి?
  • మరోసారి హాట్ టాపిక్ గా మారిన నాగబాబు వ్యాఖ్యలు
"కామెంట్ నంబర్ -2. ఏబీఎన్ చానల్ లో ఒకసారి ఇచ్చిన ఇంటర్వ్యూ" అంటూ నటుడు నాగబాబు మరోసారి బాలకృష్ణను టార్గెట్ చేసుకుని ఓ వీడియోను విడుదల చేశారు. ఇటీవల బాలకృష్ణ ఎవరో తెలియదంటూ మాట్లాడి, ఆపై విమర్శలు వెల్లువెత్తడంతో తాను ఒకప్పటి కమేడియన్ బాలకృష్ణ గురించి మాట్లాడానని చెప్పిన నాగబాబు, ఇప్పుడు బాలయ్య చేసిన మరో వ్యాఖ్యపై స్పందించారు.

 "పవన్ కల్యాణ్ ఇట్లా కామెంట్ చేశాడు మీ ఒపీనియన్ ఏంటి? డెఫినెట్ గా, పవన్ కల్యాణ్ తప్పుగా మాట్లాడారు. పవన్ కల్యాణ్ కరెక్ట్‌ గా మాట్లాడలేదు అంటూ మీరు కామెంట్ చేయవచ్చు. మీరు విమర్శించవచ్చు. ఆ... అవన్నీ మాకవసరం లేదు. మాకు మేమే హీరోలం, మాకు మేమే సూపర్ స్టార్లం.. అంటే.. వెరీగుడ్ సార్. మీకు మీరే సూపర్ స్టార్లు. మాకు అబ్జెక్షన్ లేదు. కానీ, మిగతావాళ్లు కాదా? మీరేనా సూపర్ స్టార్స్? మీరేనా గొప్పనటులు. పవన్ కల్యాణ్ కాదా? హూ... అసలు ఈ టైప్ ఆఫ్ కామెంట్ ఏంటి?

మాకు మేమే స్టార్లం. మాకు మేమే సూపర్ స్టార్లం. మాకు మేమే హీరోలం ఏంటి? దీన్ని కామెంట్ చేయడం కుదరదా మాకు? చేతకాదా మాకు? మేం కౌంటర్ చేయలేమా? అయినా ఎందుకులే చూద్దాం... చూద్దాం... చూద్దాం... అని చాలా ఓపికగా వెయిట్ చేశాం. సో... ఇక్కడ సూపర్ స్టార్స్ ఒక్కళ్లే కాదు. చాలా మంది ఉంటారు స్టార్స్ ఇక్కడ. ప్రతి వాళ్లూ స్టార్సే. పేరున్న ప్రతి వాళ్లూ స్టార్సే. మీరూ, మీకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు మాత్రమే స్టార్లు కాదు. వాళ్లొక్కళ్లే స్టార్స్ కాదు. చాలా మంది స్టార్స్ ఉన్నారు. మహేష్ బాబు అనబడే స్టార్ ఉన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక స్టార్ ఉన్నాడు. పవన్ కల్యాణ్ అనే స్టార్ ఉన్నాడు. మెగాస్టార్ ఉన్నాడు. సూపర్ స్టార్ కృష్ణగారు ఉన్నారు. చాలా మంది స్టార్స్ ఉన్నారు. మీకు మీరు స్టార్ అని చెప్పుకోండి పరవాలేదు. ఎవరినో హీరోను చేయడం ఎందుకు? మీరేమీ ఎవ్వరినీ హీరోలను చేయక్కర్లేదు. మీరెవర్ని హీరోలను చేస్తారు? జనాలు హీరోలను చేస్తారు. జనాలకు నచ్చితే హీరోలవుతారు. జనాలు మెచ్చుకుంటే స్టార్స్ అవుతారు. దీనికి కూడా మేము కామెంట్ చేయవచ్చు. అయినా కూడా మేము కామ్‌గానే ఉన్నాం. దీనికి కూడా మేము కామెంట్ చేయలేదు" అంటూ ఓ వీడియోను నాగబాబు విడుదల చేశారు. దాన్ని మీరూ చూడవచ్చు.
Nagababu
Pawan Kalyan
Balakrishna
Video

More Telugu News