ఎంఐఎం అధినేతతో వైకాపా నేత గౌతమ్ రెడ్డి భేటీ... 4 గంటల పాటు చర్చలు!

  • దాదాపు నాలుగు గంటల పాటు భేటీ
  • తాజా రాజకీయ పరిణామాలపై చర్చ
  • వైకాపాకు మద్దతిస్తానని గతంలోనే చెప్పిన ఒవైసీ
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్ రెడ్డి, హైదరాబాద్ లో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీతో చర్చలు జరిపారు. జగన్ కు అత్యంత సన్నిహిత నేతల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి, నిన్న దాదాపు నాలుగు గంటల పాటు అసదుద్దీన్ తో భేటీ అయి, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ మర్యాద పూర్వకంగానే కలిశారని పైకి అంటున్నా, రానున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం మద్దతు కోరేందుకే గౌతమ్ రెడ్డి వచ్చినట్టు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ముస్లింల ప్రాబల్యం అధికంగా ఉన్న ప్రాంతాల్లో తాను వైకాపాకు మద్దతిస్తూ ప్రచారం చేస్తానని గతంలోనే అసదుద్దీన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

YSRCP
MIM
Asaduddeen Owaisi
Goutam Reddy

More Telugu News