అవినీతికి అడ్డుకట్ట వేయకపోతే ప్రజల మూడ్ మారిపోయే అవకాశం ఉంది... సీఎం యోగికి లేఖ రాసిన సొంతపార్టీ ఎమ్మెల్యే
- సంభాల్ జిల్లా అధికారుల్లో పెచ్చుమీరుతున్న అవినీతి
- రూ. 200 విలువైన డస్ట్ బిన్ రూ. 12 వేలా?
- ప్రజల మూడ్ మారకముందే చర్యలు తీసుకోండి
ఎమ్మెల్యే అజిత్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ.. సంభాల్ జిల్లా అధికారుల్లో చాలామంది అవినీతిపరులేనని ఆరోపించారు. రూ.200 విలువైన చెత్త బుట్టలను రూ. 12 వేలు పెట్టి కొనుగోలు చేశారంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇక, చాలా గ్రామాల్లో విద్యుత్ కనెక్షన్లే లేకున్నా ప్రజలకు బిల్లులు మాత్రం పంపిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు.