యూపీలో స్టింగ్ ఆపరేషన్ కలకలం... లంచం కోరిన ముగ్గురు మంత్రుల కార్యదర్శులు!
- కాంట్రాక్టర్ వేషంలో వెళ్లిన చానల్ విలేకరి
- రూ. 40 లక్షల లంచం కోరిన సెక్రెటరీ
- సిట్ ను ఏర్పాటు చేసిన యోగి సర్కారు
- ముగ్గురు కార్యదర్శుల అరెస్ట్
రాజ్ భర్ కార్యదర్శి కశ్యప్, ఓ ట్రాన్స్ ఫర్ చేయించేందుకు రూ. 40 లక్షలు అడిగాడు. గనులను కేటాయించేందుకు, స్కూళ్లకు అనుమతులు ఇచ్చేందుకు సంబంధిత మంత్రుల కార్యదర్శులు డీల్స్ మాట్లాడారు. ఈ వ్యవహారం టీవీలో ప్రసారం కావడంతో, ప్రభుత్వం స్పందించి సిట్ ను ఏర్పాటు చేయగా, అవినీతిపై ప్రాథమిక ఆధారాలు ఉన్నాయన్న కారణంతో వారిని అరెస్ట్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. ఓ కాంట్రాక్టర్ వేషంలో వెళ్లిన చానల్ రిపోర్టర్ వారి భాగోతాలను బయటపెట్టాడు.