పామును పోలిన లెగ్గింగ్స్ ధరించిన భార్య.. పొరబడి చావబాదిన భర్త!

  • పామనుకుని బ్యాట్‌తో దాడిచేసిన భర్త
  • కాళ్లు విరిగి లబోదిబోమన్న అర్ధాంగి
  • ఆసుపత్రికి తరలింపు
ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తే ఏమవుతుందో చెప్పేందుకు ఇది ప్రత్యక్ష ఉదాహరణ. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే.. దుస్తులు కొనేందుకు షాపింగ్‌కు వెళ్లిన ఓ యువతి అక్కడ పాము డిజైన్లతో కొత్తగా మార్కెట్లోకి వచ్చిన లెగ్గింగ్స్‌ను చూసి మనసు పారేసుకుంది. వెరైటీగా ఉండడంతో ఓ జత కొనుగోలు చేసింది.

 భర్తను ఆటపట్టించేందుకు రాత్రి వాటిని ధరించి నిద్రపోయింది. అయితే, రాత్రి ఎందుకో ఆమె గదిలోకి వెళ్లిన భర్తకు బెడ్‌పై రెండు పాములు కదలాడుతున్నట్టు కనిపించింది. పరిశీలించి చూసి పాములే అనుకుని భయపడ్డాడు. వెంటనే చప్పుడు చేయకుండా ఇంట్లో ఉన్న బేస్‌బాల్ బ్యాట్ అందుకుని బలంగా కొట్టాడు. బ్యాట్ దెబ్బకు ఆమె కెవ్వుమంటూ కేకలు వేసింది.

అయితే, ఆమె కూడా పాములను చూసి భయపడిందనుకుని మరో దెబ్బ వేశాడు. ఈసారి బాధతో విలవిల్లాడుతూ.. అవి పాములు కావని, తన కాళ్లని చెప్పడంతో భర్తకు విషయం బోధపడింది. బ్యాట్ దెబ్బలకు తాళలేక కన్నీరు పెట్టుకున్న ఆమెను వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆమె కాళ్లకు స్కాన్ చేసిన వైద్యులు ఎముకలు విరిగినట్టు తేల్చారు.
Go Back to Shorts
Leggings
Snake
Australia
Fashion
Husband
Hospital

More Telugu News