Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

హీరోయిన్‌తో వైభవంగా ర్యాపర్ నోయెల్ వివాహం

  • కొద్దిరోజులుగా ప్రేమలో నోయెల్, ఎస్తేర్
  • నోయెల్‌కు నటుడిగానూ గుర్తింపు
  • వివాహానికి హాజరైన రాజమౌళి
ర్యాపర్, నటుడు నోయెల్ వివాహం నేడు ఎస్తేర్ నోరోన్హా అనే నటితో క్రైస్తవ మత సంప్రదాయంలో కర్ణాటకలోని మంగళూర్ లో ఘనంగా జరిగింది. గాయకుడిగా తన ప్రస్థానాన్ని మొదలు పెట్టిన నోయెల్ నటుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘మగధీర’ నుంచి ‘పడి పడి లేచె మనసు’ వరకూ ఎన్నో చిత్రాల్లో గాయకుడిగా రాణించాడు. ఇక ఎస్తేర్ విషయానికి వస్తే మంగుళూరుకు చెందిన ఈ భామ ‘1000 అబద్దాలు’ చిత్రంతో కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమైంది.

కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట తాజాగా పెళ్లి పీటలెక్కింది. ఈ సందర్భంగా పెళ్లిలో దిగిన ఫోటోలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నాడు. ‘మేము ఇద్దరం కాదు.. ఒక్కటే. నా హృదయానికి ఆమే రాణి’ అని నోయల్ ట్వీట్‌లో పేర్కొన్నాడు. వీరి వివాహానికి దర్శకధీరుడు రాజమౌళి తదితరులు హాజరయ్యారు.  
Noel

More Telugu News