ఉత్తరప్రదేశ్ లో ఎన్ కౌంటర్.. ఇద్దరు గోహంతకులను కాల్చి చంపిన పోలీసులు

  • ఆవులను చంపి, మాంసాన్ని విక్రయిస్తున్న ముఠా
  • గ్రామంలోకి వచ్చిన పోలీసులపై కాల్పులు
  • పోలీసుల కాల్పుల్లో ఇద్దరి మృతి.. మరో ఇద్దరు పరార్
గోహంతకులకు, పోలీసులకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ సమీపంలో ఉన్న శికర్పూర్ గ్రామంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, గ్రామంలోని కొందరు వ్యక్తులు ఆవులను చంపి, వాటి మాంసాన్ని విక్రయిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లారు. ఈ సందర్భంగా పోలీసులపై వారు కాల్పులు ప్రారంభించారు. పోలీసులు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గోహంతకులు మరణించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, మరో ఇద్దరు గోహంతకులు పారిపోయారని చెప్పారు. ఘటనా స్థలంలో వంద కిలోల ఆవు మాంసాన్ని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
Go Back to Shorts
cow slatters
encounter
Uttar Pradesh
police
fire

More Telugu News