భారత్ లో వేలాది ఏళ్ల క్రితమే మిస్సైల్ టెక్నాలజీ.. కౌరవులంతా టెస్ట్ ట్యూబ్ బేబీలే!: ఆంధ్రా వర్సిటీ వీసీ
- విష్ణుమూర్తి సుదర్శనచక్రం గైడెడ్ టెక్నాలజీనే
- 100 కుండల్లో కౌరవులు జన్మించారు
- 106వ సైన్స్ కాంగ్రెస్ లో మాట్లాడిన వీసీ నాగేశ్వరరావు
పంజాబ్ లోని జలంధర్ లో జరుగుతున్న 106వ సైన్స్ కాంగ్రెస్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన కౌరవుల తల్లి గాంధారి గురించి ప్రస్తావించారు. 100 అండాలను వంద కుండల్లో పెట్టి ఫలదీకరించిన తర్వాతే కౌరవులు పుట్టారని తెలిపారు. వారంతా టెస్ట్ ట్యూబ్ బేబీలేనని స్పష్టం చేశారు.