నాతో డాన్స్ చేయడం ఇష్టమని చరణ్ చెప్పాడు: కైరా అద్వాని
- నా పాత్ర పేరు 'సీత'
- రామ లవ్స్ సీత అనే పాట ఇష్టం
- మా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది
ఈ నేపథ్యంలో ఈ సుందరి ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా వుంది. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "ఈ సినిమాలో 'రామ' పేరుతో చరణ్ కనిపిస్తే .. 'సీత' పేరుతో నేను కనిపిస్తాను. కుటుంబ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్లో సంప్రదాయ బద్ధంగా కనిపిస్తాను. చరణ్ కి .. నాకు మధ్య కెమిస్ట్రీ చాలా బాగుందనే టాక్ మాత్రం తప్పనిసరిగా వస్తుంది. ఈ సినిమాలో 'రామ లవ్స్ సీత' అనే సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ పాటలో నేను, చరణ్ చాలా బాగా డాన్స్ చేశాము. చరణ్ మంచి డాన్సర్ అనే విషయం మీ అందరికీ తెలిసిందే. అలాంటి చరణ్ .. నాతో డాన్స్ చేయడం అంటే ఇష్టం అని చెప్పినప్పుడు నా ఆనందం అంతా ఇంతా కాదు" అని చెప్పుకొచ్చింది.