తెలంగాణలో బీజేపీకి డిపాజిట్లు దక్కలేదు.. ఏపీలోనూ అదే రిపీట్ కాబోతోంది!: సీపీఐ నారాయణ
- ఏపీని కేంద్రం దగా చేసింది
- బీజేపీకి తెలుగురాష్ట్రాల్లో పుట్టగతులుండవు
- ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన సీపీఐ నేత
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చాలాచోట్ల బీజేపీకి డిపాజిట్లు రాలేదని నారాయణ గుర్తుచేశారు. ఆంధ్రప్రదేశ్ లోనూ అదే పలితం పునరావృతం అవుతుందని జోస్యం చెప్పారు. కాగా, ఢిల్లీలో ప్రత్యేకహోదా సాధన సమితి చేపడుతున్న ధర్నాకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, రాఘవులు, చలసాని శ్రీనివాస్ తదితరులు మద్దతు పలికారు.