కర్ణాటక మంత్రి డీకే శివకుమార్ ను మూడు గంటల పాటు విచారించిన ఐటీ అధికారులు

  • శివకుమార్ కుటుంబానికి మరో షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు
  • ఆయన తల్లి కోసం డొడ్డహాలహళ్లికి వెళ్లిన అధికారులు
  • ఆమె లేకపోవడంతో.. ఇంటికి నోటీసులను అతికించిన వైనం
కర్ణాటక జలవనరుల శాఖ మంత్రి డీకే శివకుమార్ కుటుంబానికి ఐటీ అధికారులు మరో షాక్ ఇచ్చారు. గతంలో జరిపిన ఐటీ దాడులకు సంబంధించిన వివరాలను సేకరించేందుకు తమ కార్యాలయానికి రావాలంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. నిన్న డీకే శివకుమార్ ను మూడు గంటల పాటు విచారించారు. మరోవైపు, శివకుమార్ తల్లి గౌరమ్మను విచారణకు రావాలంటూ ఆదేశించారు. కనకపుర ప్రాంతంలోని దొడ్డహాలహళ్లి నివాసానికి ఐటీ అధికారులు వెళ్లారు. ఆమె అక్కడ లేకపోవడంతో... ఇంటికి నోటీసులు అంటించారు. మరోవైపు, కక్ష పూరితంగానే శివకుమార్ కుటుంబంపై ఐటీ దాడులు నిర్వహిస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. 
Go Back to Shorts
dk shivakumar
karnataka
it
raids
notice

More Telugu News