66 కేసులు పరిష్కారమైతే.. రూ.80 వేల కోట్లు వస్తాయి: అరుణ్ జైట్లీ

మొండి బకాయిలు, నిరర్థక ఆస్తుల రికవరీకి ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు చేపడుతోందని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. నేడు ఆయన తన ఫేస్‌బుక్ బ్లాగ్‌పోస్టులో దీనిపై పలు విషయాలను వెల్లడించారు. ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.70 వేల కోట్ల మొండి బకాయిలను కమర్షియల్ బ్యాంకులు రికవరీ చేసే అవకాశం ఉందన్నారు.

ఎస్సార్ స్టీల్ ఇండియా లిమిటెడ్, భూషణ్ పవర్ అండ్ స్టీల్ లిమిటెడ్ తదితర కేసులు ఈ ఆర్థిక సంవత్సరంలో పరిష్కారమయ్యే అవకాశముందన్నారు. ఈ కేసులను నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ పరిష్కరిస్తోందన్నారు. మొత్తంగా 66 కేసులు పరిష్కారమైతే రుణదాతలకు రూ.80 వేల కోట్లు వస్తాయని జైట్లీ వెల్లడించారు.
Go Back to Shorts
Arun Jaitly
NDA
Facebook
Bhushan Power and Steel
Law tribunal

More Telugu News