'రాచ్చసన్' రీమేక్ కూడా ఆ హీరో దగ్గరికే వెళ్లి ఆగిందట!
- తమిళంలో హిట్ కొట్టిన 'రాచ్చసన్'
- చిన్న సినిమా అయినా పెద్ద హిట్
- తెలుగు రీమేక్ లో బెల్లంకొండ శ్రీనివాస్
ఇప్పుడు ఈ రీమేక్ హక్కులు చేతులు మారినట్టుగా ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. దర్శకనిర్మాతలు ఎవరన్నది తెలియదుగానీ, ఈ సినిమా బెల్లంకొండ శ్రీనివాస్ దగ్గరికే వెళ్లి ఆగిందని అంటున్నారు. ఆయన ఈ సినిమా చేయడానికి అంగీకరించడం జరిగిపోయిందని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటికి రానున్నాయి.