ఎన్నికల కార్యాచరణను ప్రకటించిన పవన్ కల్యాణ్

03-01-2019 Thu 12:54 | Andhra
  • ఎన్నికల కోసం జనసేన రాలేదు
  • భావితరాల పాతికేళ్ల భవిష్యత్తు కోసమే జనసేన
  • చట్ట సభల్లోకి కొత్త తరం అడుగు పెట్టాల్సిన అవసరం ఉంది
జనసేన పార్టీ ఎన్నికల కోసం రాలేదని... భావితరాల పాతికేళ్ల భవిష్యత్తు కోసం పోరాటం చేయడానికి, ప్రజలకు మరింత మెరుగైన జీవితాన్ని అందించేందుకు వచ్చిందని జనసేనాని పవన్ కల్యాణ్ తెలిపారు. యువత ఆశయాలను నెరవేర్చేందుకే గత కొన్ని నెలలుగా తాము ప్రజా పోరాట యాత్రలో భాగంగా కానీ, మరో విధంగా కానీ తిరుగుతున్నామని చెప్పారు. ఆడపడుచుల ఆకాంక్షలను అర్థం చేసుకుంటూ తాము ముందుకెళుతున్నామని అన్నారు.

2014లో తాము కొన్ని పార్టీలకు మద్దతు తెలిపామని... తెలుగు ప్రజల సుస్థిరత కోసం ఆరోజు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని పవన్ తెలిపారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్ర సమతుల్యత కోసం మొత్తం 175 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వామపక్షాలను మాత్రమే తమతో కలుపుకుంటామని... అధికార, ప్రతిపక్షాలతో కలసి ముందుకు సాగబోమని తెలిపారు. ఇతర పార్టీలతో తాము కలుస్తున్నామని... తమకు కొన్ని స్థానాలను వారు కేటాయించారంటూ... జనసేన శ్రేణులను అయోమయంలో పడేసేలా రకరకాల వార్తలను ప్రచారం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు.

యువతకు బంగారు భవిష్యత్తును అందించాలనేదే తమ ఆశయమని... అందుకే కొత్తదనంతో కూడిన నాయకత్వం వైపు తాము చూస్తున్నామని పవన్ తెలిపారు. మంచివారు, అనుభవజ్ఞులైన నాయకులకు స్థానం కల్పిస్తామని... ఇదే సమయంలో 175 స్థానాల్లో మహిళలు, యువతకే ఎక్కువ అవకాశం ఇవ్వబోతున్నామని చెప్పారు. చట్ట సభల్లోకి కొత్త తరం అడుగుపెట్టాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు తాము వ్యూహం రచిస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో అధికార, ప్రతిపక్ష నేతలు చేస్తున్న వ్యాఖ్యలను జనసైనికులంతా తమతమ స్థాయుల్లో ఖండించాలని పిలుపునిచ్చారు. 
Pawan Kalyanjanasena2019 elections

More Telugu News

చలికాలంలో పెరుగు తినొచ్చా? జలుబు చేస్తుందా?.. నిపుణుల సమాధానం ఇదే!

25-10-2026 Sun 13:31

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10
..more