యాక్టివాను ఢీకొన్న టిప్పర్... ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్ల దుర్మరణం!

  • హైదరాబాద్, పీవీ ఎక్స్ ప్రెస్ వే వద్ద ఘటన
  • అదుపుతప్పి ఢీకొన్న టిప్పర్
  • ఆఫీసుకు వెళుతున్న ఇద్దరు మృతి
హైదరాబాద్ లో ఈ ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను బలిగొంది. నానక్ రామ్ గూడలోని ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న దీపికా నిఖిల్, సయీద్ అహ్మద్ లు ఈ ఉదయం లంగర్ హౌస్ పరిధిలోని పీవీ ఎక్స్ ప్రెస్ వే, పిల్లర్ నంబర్ 102 వద్ద వెళుతుండగా, అదుపుతప్పిన టిప్పర్ బలంగా ఢీకొంది. ఈ ఘటనలో దీపిక, సయీద్ లకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. వీరిద్దరూ కలిసి ఆఫీసుకు వెళుతున్న వేళ ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసును నమోదు చేసి విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
Go Back to Shorts
Hyderabad
Road Accident
Langer House

More Telugu News