సంక్రాంతిలోగా సమస్య పరిష్కారం కాకపోతే నిరాహార దీక్ష: శివాజీ
- అన్ని ఆధారాలను చంద్రబాబుకు అందజేస్తా
- ప్రతిపక్ష పార్టీకి అనుకూలంగా ఉన్నతాధికారులు
- ఆ భూములేమీ కలెక్టర్ల అబ్బ సొత్తు కాదు
చుక్కల భూముల విషయంలో అధికారులు మంత్రులను కూడా లెక్కచేయడం లేదన్న శివాజీ భూముల సమస్య రాజకీయ నాయకులకు వరంగా మారిందన్నారు. ఈ భూముల విషయంలో సంక్రాంతిలోగా సమస్యను పరిష్కరించకుంటే నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ విషయంలో కాస్త గట్టిగా మాట్లాడితే భూములను లాక్కుంటామంటూ కలెక్టర్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ భూములేమీ కలెక్టర్ల అబ్బసొత్తు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చుక్కల భూముల విషయంలో అన్ని ఆధారాలు తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని చంద్రబాబుకు అందజేస్తానని శివాజీ వివరించారు.