బ్రేకింగ్: అయ్యప్ప ఆలయంలో నవ చరిత్ర... ఇద్దరు మహిళలకు స్వామి దర్శనం... విలపిస్తున్న భక్తులు!
- పంతం నెగ్గించుకున్న కేరళ సర్కారు
- స్వామిని దర్శించుకున్న బిందు, కనకదుర్గ
- భక్తుల సంఖ్య స్వల్పంగా ఉండటంతో పని ముగించిన పోలీసులు
- ఆలయం అపవిత్రమైందని వాపోతున్న భక్తులు
బిందు, కనకదుర్గ అనే మహిళలు స్వామిని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా స్వల్ప తోపులాట జరిగినట్టు వార్తలు వస్తున్నాయి. రుతుస్రావం వయసులో ఉన్న మహిళలు స్వామిని దర్శించుకున్నారని, తాము అడ్డుకోలేకపోయామని భావించిన అయ్యప్ప భక్తులు బోరున విలపించారు. ఆలయం అపవిత్రమైపోయిందని పలువురు వాపోయారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.