Maharashtra: ఒకే రకం దుస్తులతో, ఒకేలా డ్యాన్స్... ఫడ్నవీస్ భార్య అమృత, కుమార్తె దివిజల వైరల్ వీడియో!

మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృత, కుమార్తె దివిజ‌ల డాన్స్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. వారి బంధువుల వివాహానికి హాజరైన వీరు సంగీత్ లో దుమ్ము దులిపారు. 'బాజీరావ్ మస్తానీ' చిత్రంలోని టైటిల్ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. ఈ తల్లీకూతుళ్లు ఒకే రకం దుస్తులు ధరించి, ఒకేలా డ్యాన్స్ చేయడం గమనార్హం. ఆపై అమృత తన ఫేస్‌ బుక్ ఖాతాలో ఈ వీడియోను షేర్ చేసుకున్నారు. వీరిద్దరూ అచ్చం దీపికా పదుకొణె తరహాలోనే నృత్యం చేశారని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఆ వైరల్ వీడియోను మీరూ చూడవచ్చు.
Maharashtra
Devendra Fadnavis
Amruta
Divija

More Telugu News