ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారూ!: జగన్
- ఏపీ ప్రజల కోసం మేం ఉద్యమిస్తూనే ఉన్నాం
- చంద్రబాబు నాటకాలను ప్రజలు నమ్మరు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ అధినేత
జగన్ ట్విట్టర్ లో స్పందిస్తూ..‘రాజకీయ నాటకంలో కుట్రపూరిత కూటములు కడుతూ, కొత్త మిత్రులను వెతుకుతూ, ఏపీ పాలనను గాలికొదిలేసి తెలంగాణ ఎన్నికల్లో తీరిక లేకుండా గడిపిన మీకు.. మా ఉద్యమాలు తెలియకపోవచ్చు. కానీ మేము చేసిన నిరంతర పోరాటం రాష్ట్రప్రజలకు సుపరిచితం. ఎన్నికల ముందు మీ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు చంద్రబాబు నాయుడు గారూ!’ అని ట్వీట్ చేశారు.