'కదరం కొందన్' నుంచి ఆసక్తిని రేపుతోన్న విక్రమ్ లుక్
- కమలహాసన్ నిర్మాతగా 'కదరం కొందన్'
- విక్రమ్ జోడీగా అక్షర హాసన్
- సంగీత దర్శకుడిగా గిబ్రాన్
ఇటీవల ఈ సినిమా నుంచి వదిలిన ఫస్టులుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మరోలుక్ ను వదిలారు .. విక్రమ్ ను డిఫరెంట్ గా చూపుతోన్న ఈ లుక్ కూడా ఆసక్తిని రెత్తిస్తోంది. రాజేశ్ సెల్వ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాను తెలుగులోను విడుదల చేయనున్నారు. తన కెరియర్లో ప్రత్యేకంగా నిలిచిన చిత్రాల జాబితాలో ఈ సినిమా కూడా నిలవడం ఖాయమనే నమ్మకంతో విక్రమ్ .. ఆయన అభిమానులు వున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.