స్వైన్ ఫ్లూతో ఐపీఎస్ అధికారి డాక్టర్ మధుకర్ శెట్టి కన్నుమూత.. ఉదయమే మహా మృత్యుంజయ యాగం!
- శుక్రవారం రాత్రి కన్నుమూత
- హెచ్1 ఎన్1 వైరస్ సోకినట్టు చెప్పిన వైద్యులు
- నిజాయతీ గల ఆఫీసర్‌గా గుర్తింపు
1999 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన మధుకర్ శెట్టి చిక్ మగుళూరు ఎస్పీగా, కర్ణాటక లోకాయుక్తగా పనిచేశారు. నిజాయతీపరుడిగా పేరు తెచ్చుకున్న ఆయన కోలుకోవాలంటూ బెంగళూరు సమీపంలోని బ్యాతరాయనపుర గ్రామస్థులు చంద్రమౌళేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం మహా మృత్యుంజయ యాగం నిర్వహించారు. మధుకర్ మరణవార్త తెలిసి గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మధుకర్ స్వస్థలం కర్ణాటకలోని కుందపుర. తండ్రి ప్రముఖ కన్నడ జర్నలిస్ట్ వడ్డర్సె రఘురామ శెట్టి.