54 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా
- రెండో ఇన్నింగ్స్ లో తడబడ్డ టీమిండియా
- పుజారా, కోహ్లీ డకౌట్
- నాలుగు వికెట్లు తీసిన కమ్మిన్స్
జట్టు స్కోరు 28 పరుగులు ఉన్నప్పుడు ఓపెనర్ హనుమ విహారి (13) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత పుజారా (0), కోహ్లీ (0), రహానే (1), రోహిత్ శర్మ (5)లు వరుసగా పెవిలియన్ చేరారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28), రిషభ్ పంత్ (6)లు నాటౌట్ గా నిలిచారు. కమిన్స్ 4 వికెట్లు తీయగా... హ్యాజిల్ వుడ్ ఒక వికెట్ తీశాడు. ప్రస్తుతం టీమిండియా 346 పరుగుల ఆధిక్యతను సాధించింది.