కేంద్రంపై కొత్త నిరసన.. శివుడి వేషధారణలో పార్లమెంటుకు టీడీపీ నేత శివప్రసాద్!
- పార్లమెంటు ఆవరణలో టీడీపీ నేతల ఆందోళన
- ప్రత్యేకహోదా, విభజన హామీల అమలుకు డిమాండ్
- కడప స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కేంద్రంపై ఆగ్రహం
దేశంలో అనధికార ఎమర్జెన్సీ విధించారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేత శివప్రసాద్ శివుడి వేషధారణలో పార్లమెంటుకు చేరుకున్నారు. కడప స్టీల్ ప్లాంట్ సహా విభజన చట్టంలోని పలు హామీల విషయంలో మోదీ సర్కారు ఆంధ్రులను మోసం చేసిందని శివప్రసాద్ అన్నారు. మరోపక్క, కావేరీ నదిపై డ్యామ్ కు వ్యతిరేకంగా అన్నాడీఎంకే పార్లమెంటు సభ్యులు చేస్తున్న ఆందోళనకు ఆయన మద్దతు పలికారు.