రాహుల్ ప్రధాని అవ్వాలన్న కలలు కనడం ఆపేస్తే మంచిది: బీజేపీ
- రాహుల్ ఎప్పటికీ ప్రధాని కాలేరు
- పశ్చిమ బెంగాల్లోనూ ఓ పప్పు ఉన్నాడు
- మమతా బెనర్జీపై తీవ్ర ఆరోపణలు
‘‘కానీ నేనో విషయం చెప్పదలిచాను. ఆయన కలలు ఎప్పటికీ కల్లలుగానే మిగిలిపోతాయి. మోదీని మళ్లీ ప్రధానిని చేయాలని దేశ ప్రజలు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశారు’’ అని విజయ్ పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్ బీజేపీ తలపెట్టిన రథయాత్రకు మమత ప్రభుత్వం అనుమతులు ఇచ్చేందుకు నిరాకరించడాన్ని వ్యతిరేకిస్తూ కృష్ణా నగర్లో నిర్వహించిన ర్యాలీలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమ బెంగాల్లోనూ ఓ పప్పు ఉన్నాడని, ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్నారని విమర్శించిన ఆయన అది ఎవరన్నది చెప్పకపోవడం గమనార్హం. మమతా బెనర్జీ ప్రభుత్వం చొరబాటుదార్లకు తాయిలాలు ఇచ్చి ఓటు బ్యాంకును భద్రపరుచుకుంటోందని విజయ్వర్గియ ఆరోపించారు.