బులంద్‌షహర్ కేసులో కీలక పరిణామం.. సీఐని కాల్చిన కారు డ్రైవర్ అరెస్ట్
- సీఐని చంపింది తానేనని అంగీకరించిన కారు డ్రైవర్
- నిందితుడికి పలు నేరాలతో సంబంధం
- కీలక నిందితులు పరారీలో
సీఐని చంపింది తానేనని ప్రశాంత్ అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. ప్రశాంత్‌కు గతంలో పలు నేరాలతో సంబంధం ఉందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితులు పరారీలో ఉన్నారు. వారిలో బజరంగ్‌దళ్‌కు చెందిన యోగేశ్ రాజ్, బీజేపీ నేత శిఖర్ అగర్వాల్, ఉపేంద్ర రాఘవ్, విశ్వహిందూ పరిషత్ కార్యకర్త పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.