రివర్స్ అయిన దొంగగారి ప్లాన్.. పోలీసులకే ఫోన్ చేసి రక్షించమన్న వైనం!

  • వస్తువులు దొంగిలించేందుకు కారులోకి వెళ్లాడు 
  • వెంటనే కారు లాక్ పడిపోయింది
  • పోలీసులు కారులోనుంచి బయటకు తీసుకొచ్చారు
దర్జాగా దొంగతనానికి వెళ్లిన దొంగకు విచిత్ర పరిస్థితి ఎదురైంది. ప్రాణాలు పోయే పరిస్థితి తలెత్తడంతో, తనను రక్షించమంటూ సదరు దొంగ పోలీసులకే ఫోన్ చేశాడు. ఈ విషయాన్ని స్వయంగా పోలీసులే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నార్వేకు చెందిన ఓ 17 ఏళ్ల దొంగ కారులోని వస్తువులు దొంగిలించేందుకు కారులోకి వెళ్లి దానిలో చిక్కుకుపోయి.. తమకు ఫోన్ చేసిన వైనాన్ని పోలీసులు ట్వీట్‌లో వివరించారు.

‘కారులోకి ఎక్కగానే లాక్ పడటంతో అతడు దాని నుంచి బయటకు రాలేకపోయాడు. కారులో కూర్చొని.. ఒక స్నేహితుడికి ఫోన్ చేసినట్లు మాకు చేశాడు. మాకు ఫోన్‌ చేసినప్పుడు అతడు చాలా ఒత్తిడితో ఉన్నాడు. అతడిని కారులో నుంచి బయటకు తీసుకురాగానే ఆ భయం మొత్తం మటుమాయమైంది’ అని నార్వే పోలీసులు ట్వీట్‌లో వెల్లడించారు. అనంతరం పోలీసులు ఆ యువకుడిని స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించి... తల్లిదండ్రులకు అప్పగించారు.

Thief
Narvey
Car
Police
Twitter

More Telugu News