పోలీస్ అధికారి కుమార్తెపై విద్యార్థుల గ్యాంగ్ రేప్!
- ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో ఘటన
- బాలికకు మాయమాటలు చెప్పిన యువకుడు
- స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారం
యూపీలోని కాన్పూర్ లో ఉంటున్న ఓ బీటెక్ విద్యార్థికి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి(12)తో పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో సదరు బాలికకు మాయమాటలు చెప్పి తన ఫ్లాట్ కు రప్పించుకున్న బీటెక్ విద్యార్థి మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ నేపథ్యంలో బాధితురాలి ఫిర్యాదుతో నలుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.