కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం.. రేపు శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

  • ఎం.కంబాలదిన్నెవద్ద ఉక్కు కర్మాగారం
  • రేపు ఉదయం 11 గంటలకు శంకుస్థాపన
  • కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోంది: సీఎం రమేశ్
  సీఎం చంద్రబాబు రేపు కడప జిల్లాలో పర్యటించనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించే ఉక్కు కర్మాగారానికి రేపు ఉదయం 11 గంటలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. మైలవరం మండలం ఎం.కంబాలదిన్నె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. రూ.18 వేల కోట్లతో ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాలన్నది ప్రభుత్వ యోచన. ఈ సందర్భంగా టీడీపీ నేత సీఎం రమేశ్ మాట్లాడుతూ, కేంద్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తోందని అన్నారు. ఈ విషయమై పలుమార్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రికి విన్నవించినా స్పందించలేదని, శంకుస్థాపన కార్యక్రమానికి జిల్లాకు చెందిన ప్రతిపక్ష నేతలూ హాజరుకావాలని కోరుతున్నానని అన్నారు.
Go Back to Shorts
cuddapah
steel factory
Andhra Pradesh
cm
Chandrababu
Telugudesam

More Telugu News