ప్రీ రిలీజ్ వేడుకలో 'వినయ విధేయ రామ' ట్రైలర్ రిలీజ్!
- రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్
- రాత్రి 9 గంటలకి ట్రైలర్ రిలీజ్
- జనవరి 11న సినిమా రిలీజ్
కేటీఆర్ .. చిరంజీవి ఈ వేడుకకి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక చరణ్ తో గల సాన్నిహిత్యం కారణంగా ఎన్టీఆర్ కూడా ఈ వేడుకకి వస్తున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. ఈ వేదికపై రాత్రి 9 గంటలకి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. సినిమాపై మరింతగా అంచనాలు పెరిగేలా ఈ ట్రైలర్ ను బోయపాటి శ్రీను కట్ చేసినట్టుగా తెలుస్తోంది. వివేక్ ఒబెరాయ్ .. ప్రశాంత్ .. స్నేహా కీలకమైన పాత్రలను పోషించిన ఈ సినిమాను జనవరి 11వ తేదీన విడుదల చేయనున్నారు.