Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలాంటి ప్రశ్నలు అడగడం నాకు నచ్చదు: యాంకర్ రష్మీ

  • పెళ్లి గురించిన ప్రశ్నలు నాకు నచ్చవు 
  • నా వర్క్ లైఫ్ వేరు .. పర్సనల్ లైఫ్ వేరు 
  • సహజీవనం అనే ఆప్షన్ ఉందికదా  
బుల్లితెరపై యాంకర్ గా రష్మీ మంచి క్రేజ్ సంపాదించుకుంది. జోరుగా .. హుషారుగా ఆ కార్యక్రమాన్ని నడిపిస్తూ మంచి మార్కులు కొట్టేసింది. అడపా దడపా సినిమాలు చేస్తూ .. కుర్రకారు హృదయాలను దోచేస్తోంది. అలాంటి రష్మీ తాజాగా ట్విట్టర్లో లైవ్ చాట్ చేసింది. 'మీకు ఎలాంటి ప్రశ్నలు అంటే నచ్చవు' అని ఒక అభిమాని అడిగితే, 'పెళ్లి గురించిన ప్రశ్నలు .. వయసుకి సంబంధించిన ప్రశ్నలు అడగడం నాకు నచ్చదు' అని చెప్పింది.

సుడిగాలి సుధీర్ .. ప్రదీప్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవలసి వస్తే ఎవరిని చేసుకుంటారు?' అని మరో అభిమాని అడిగాడు. అందుకు రష్మీ స్పందిస్తూ .. 'నా వర్క్ లైఫ్ .. పర్సనల్ లైఫ్ రెండూ వేరు వేరుగా ఉంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి .. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రావడం జరగదు' అని స్పష్టం చేసింది. 'లవ్ మ్యారేజ్ .. అరేంజ్డ్ మ్యారేజ్ లో దేనిని ఎంపిక చేసుకుంటారు?' అని ఒక అభిమాని అడగ్గా, మధ్యలో 'సహజీవనం' అనే ఆప్షన్ మరొకటి ఉందిగదా' అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది. 
rashmi

More Telugu News