Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రేమిస్తున్నానని విహారయాత్రలకు తిప్పి మోసం... కటకటాల్లోకి నెట్టిన హైదరాబాద్ పోలీసులు!

  • యువతిని లొంగదీసుకున్న నాగోల్ యువకుడు
  • పెళ్లి చేసుకోవాలంటే కాలయాపన
  • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
ప్రేమించానని వెంటపడి, విహార యాత్రలకు తిప్పి, లొంగదీసుకుని ఆపై పెళ్లాడేందుకు నిరాకరిస్తున్న ఓ మోసగాడిని పోలీసులు కటకటాల వెనక్కు పంపారు. హైదరాబాద్ మల్కాజ్ గిరి పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, నాగోల్‌ లోని సత్యసాయి అపార్ట్‌ మెంట్స్ లో నివాసం ఉంటున్న సందీప్ వర్మ (28) అనే యువకుడికి మల్కాజ్‌ గిరిలో ఉన్న ఓ యువతి పరిచయం అయింది.

దాంతో ఆమెను ప్రేమిస్తున్నానని  వెంటపడ్డ సందీప్, బెంగుళూరు, గోవా, షిర్డీ తదితర ప్రాంతాలకు తిప్పాడు. ఆపై సదరు యువతి తనను వివాహం చేసుకోవాలని సందీప్ ను అడగటం ప్రారంభించింది. నాటి నుంచి కాలయాపన చేస్తూ సందీప్ ఆమెను దూరం పెట్టసాగాడు. దీంతో విసిగిపోయిన ఆమె, పోలీసులను ఆశ్రయించింది. దీంతో సందీప్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని పోలీసులు వెల్లడించారు.
Hyderabad
Police
Lover
Marriage

More Telugu News