జీవనపోరాటం.. కర్చీఫ్ లు అమ్ముకుంటున్న తమిళ సీనియర్ నటి!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

జీవనపోరాటం.. కర్చీఫ్ లు అమ్ముకుంటున్న తమిళ సీనియర్ నటి!

  • నా సంపాదనంతా పిల్లల చదువుల కోసమే వెచ్చించా
  • వాళ్లు నన్ను పట్టించుకోవట్లేదు
  • మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు అమ్ముకుంటున్నా
  • 500 కు పైగా చిత్రాల్లో నటించిన రంగమ్మాళ్ ఆవేదన
సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో ఆదాయమార్గం లేక పొట్టకూటి కోసం తమిళ సీనియర్ నటి రంగమ్మాళ్ కర్చీఫ్ లు అమ్ముకుంటున్న దయనీయ సంఘటన అభిమానులను కలచివేస్తోంది. 500 కు పైగా చిత్రాల్లో నటించిన రంగమ్మాళ్ వయసు 83. సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో చెన్నైలోని మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. బామ్మ పాత్రలకు పెట్టింది పేరైన ఆమె, హాస్యనటుడు వడివేలుతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించింది. మెరీనా బీచ్ లో కర్చీఫ్ లు విక్రయించే రంగమ్మాళ్ ని గుర్తుపట్టే పర్యాటకులు, స్థానికులు ఆమెను ఆప్యాయంగా పలకరించి, ఈ దుస్థితికి గల కారణాలను అడిగి తెలుసుకుంటూ ఉండటం తరచుగా జరుగుతుంటుంది.

ఈ విషయమై మీడియా ఆమెను అడగగా, ఎంజీఆర్ కాలం నుంచే తాను సినిమాల్లో నటిస్తున్నానని, ఐదు వందలకు పైగా చిత్రాల్లో నటించి ఉంటానని చెప్పింది. సంపాదించిన డబ్బంతా తమ పిల్లల కోసం ఖర్చు చేశానని, ఇప్పుడు, వాళ్లు తనను పట్టించుకోవట్లేదని, అందుకే, ఇలా, కర్చీఫ్ లు, ఇతర వస్తువులు అమ్ముకుంటున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. వీటిని విక్రయించగా వచ్చే ఆదాయం అంతంత మాత్రమేనని, తమిళనాడు ప్రభుత్వం లేదా నడిగర్ సంఘం తనను ఆదుకోవాలని రంగమ్మాళ్ విజ్ఞప్తి చేసింది. కాగా, గత ఏడాదిలో నడిగర్ సంఘం ద్వారా ఆమెకు ఐదు వేల రూపాయల సాయం అందింది. ఫెఫ్సీ అనుసంధాన జూనియర్ ఆర్టిస్టు సంఘంలో రంగమ్మాళ్ సభ్యురాలు.  
rangammalu
tamil artist
chennai
marina beach

More Telugu News