అలీ విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: సీనియర్ నరేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అలీ విషయంలో నేను చెప్పినట్టుగానే జరిగింది: సీనియర్ నరేశ్

  • అలీ చిన్నప్పటి నుంచి నాకు తెలుసు 
  • చైల్డ్ ఆర్టిస్ట్ గా గొప్ప కామెడీ చేశాడు 
  • అలాంటి చైల్డ్ ఆర్టిస్ట్ మళ్లీ రాలేదు
తెలుగు తెరకి హాస్య కథానాయకుడిగా పరిచయమైన నరేశ్, ఎన్నో విభిన్నమైన పాత్రల ద్వారా ప్రేక్షకులకు కితకితలు పెట్టారు. ఇప్పుడు కూడా ముఖ్యమైన పాత్రలు చేస్తూ ఆయన బిజీగానే వున్నారు. తాజాగా ఆయన 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

"అలీ .. నేను ఎన్నో సినిమాలు కలిసి చేశాము. దాదాపు ఓ పాతిక సినిమాలు చేసి ఉంటాము. చిన్నప్పటి నుంచి కూడా అలీ ఇదే సమయస్ఫూర్తిని కలిగి ఉండేవాడు. తాను మెహమూద్ అంతటి ఆర్టిస్ట్ ను అవుతానని అప్పట్లోనే అనేవాడు .. అన్నట్టుగానే అయ్యాడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా అలీ మాదిరిగా కామెడీ చేసిన ఆర్టిస్ట్ ను నేను మళ్లీ చూడలేదు.. అలాంటి ఆర్టిస్ట్ రాడు కూడా. కమెడియన్ గా అలీ చేసినన్ని విభిన్నమైన పాత్రలు ఎవరూ చేసి వుండరు. అల్లు రామలింగయ్య గారి తరువాత అంతటివాడవు అవుతావని అప్పట్లోనే నేను చెప్పాను .. అలాగే అయ్యాడు" అంటూ ఆయన చెప్పుకొచ్చారు.
naresh
ali

More Telugu News