కుమార్తెకు సీమంతం చేసి ఇంటికి తీసుకెళ్తుండగా ప్రమాదం.. తల్లీ కుమార్తెల మృతి
- గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ఘటన
- ట్రాక్టర్ను ఢీకొట్టిన కారు
- ముగ్గురి మృతి.. మరో ముగ్గురు ఆసుపత్రి పాలు
ఆదివారం అర్ధరాత్రి తల్లీ కుమార్తెలు ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి ట్రాక్టర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో తల్లీకుమార్తెలు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలపాలైన మరొకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. మృతులను గుంటూరుకు చెందిన వారిగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.