కొత్తగూడెం టీఆర్ఎస్ సమావేశం రసాభాస.. సొంత మనుషులే ఓడించారని జలగం వర్గీయుల ఆందోళన!
- తాజా ఎన్నికల్లో జలగం వెంకట్రావు ఓటమి
- టీఆర్ఎస్ నేతలే కారణమన్న అనుచరులు
- కార్యకర్తలను సముదాయించిన నరేశ్ రెడ్డి
టీఆర్ఎస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేసినప్పటికీ ఆయన పరాజయం చెందారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించినప్పటికీ ఆయనకు ఈసారి పరాజయం ఎదురయింది. ఈ నేపథ్యంలో కొత్తగూడెంలో పార్టీ పరిశీలకుడు నరేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన సమావేశంలో వెంకట్రావు వర్గీయులు తీవ్ర నిరసన తెలిపారు. దీంతో అందరినీ సముదాయించిన నరేశ్ రెడ్డి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.