'వినయ విధేయ రామ' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహాలు
- ఈ నెల 26తో షూటింగ్ పూర్తి
- 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్
- సంక్రాంతికి సినిమా రిలీజ్
ఈ నెల 26వ తేదీతో ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుందట. అందువలన 27వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరపాలనే నిర్ణయానికి వచ్చారు. ఆ రోజున సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఇదే వేదికపై ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, స్నేహ .. ప్రశాంత్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. యాక్షన్ తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతోన్న ఈ సినిమాతో, చరణ్ ఖాతాలోకి మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరడం ఖాయమనేది అభిమానుల మాట.