Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రష్యా అధ్యక్షుడు పుతిన్ పెళ్లి చేసుకోబోయే అందాల భామ ఈమేనా?.. ఆమె వ్యక్తిగత వివరాలు ఇవిగో!

  • త్వరలోనే పెళ్లి చేసుకోవచ్చని ప్రకటించిన పుతిన్
  • అలీనా ప్రముఖ జిమ్మాస్ట్.. మహా అందగత్తె కూడా
  • 2008లో వెలుగు చూసిన ప్రేమాయణం
త్వరలోనే తాను రెండో పెళ్లి చేసుకోబోతున్నానంటు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. పెళ్లి కూతురు ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. 66 ఏళ్ల వయసున్న పుతిన్ ఏనాడు తన వ్యక్తిగత జీవితాన్ని బహిర్గతం చేయలేదు. ఈ నేపథ్యంలో, ఒక రష్యన్ పత్రిక ఓ ఆసక్తికర కథనాన్ని ప్రచురించింది. పుతిన్ పెళ్లి చేసుకోబోతోంది మాజీ జిమ్మాస్ట్ అలీనా కబేవా అనే అమ్మయిని అంటూ తెలిపింది. దీంతో, అలీనా ఎవరు అనే విషయాన్ని గూగుల్ లో జనాలు భారీ ఎత్తున శోధిస్తున్నారు.

అలీనా కబేవా గురించిన వివరాలు.. 
అలీనా 1983లో అప్పటి సోవియట్ యూనియన్ లో ఉన్న ఉజ్బెకిస్తాన్ లో జన్మించింది. ఆమె వయసు 35 సంవత్సరాలు. ఆమె తండ్రి ఫుట్ బాల్ ప్లేయర్. మూడేళ్ల వయసు నుంచే అలీనా రిథమిక్ జిమ్మాస్టిక్ లో సాధన ప్రారంభించారు. టీనేజ్ వయసు వచ్చే సమయానికి అందులో ఆమె టాప్ లెవెల్ కు చేరారు. 2004 ఏథెన్స్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ సాధించారు. రష్యా తరపును ఎన్నో అంతర్జాతీయ టోర్నమెంటుల్లో పాల్గొన్నారు.

జిమ్మాస్టిక్స్ ను పక్కన పెడితే... ఆమె ఒక అద్భుతమైన అందగత్తె. ఆమె అందం ఆమెను రష్యా సమాజంలో ఒక స్థాయిలో నిలిపింది. అయితే, డోపింగ్ ఆరోపణలు ఆమెను ఇరుకున పెట్టాయి. దీంతో, జిమ్మాస్టిక్స్ ను వదిలేసిన అలీనా... ఒక మీడియా హౌస్ ను ప్రారంభించి, రష్యా ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించారు. 2008లో పుతిన్ తో అలీనా ప్రేమాయణం తొలిసారి బయటకు వచ్చింది. 2013లో తొలి భార్య ల్యూడ్మిలాతో విడాకులు తీసుకున్న తర్వాత... అలీనాతో పుతిన్ సహజీవనం చేస్తున్నారనే వార్తలు వెలుగులోకి వచ్చాయి. 
putin
alina kabeva
dating
marriage
russia
president

More Telugu News