మిచెల్ ఒబామా బూట్ల ఖరీదు రూ.2.8 లక్షలు!
- హైలైట్‌గా నిలుస్తున్న ఆమె ‘హోలో గ్రాఫిక్ థై హై’ షూస్
- ఇప్పుడు నెట్టింట్లో ఇదే వైరల్
- రెండు రోజుల క్రితం ఈ బూట్లతో ఓ కార్యక్రమానికి హాజరైన మిచెల్
వేసుకునే దుస్తుల నుంచి చెప్పుల వరకు అన్నింటా ప్రత్యేకత చాటుకోవడం మిచెల్‌కు అలవాటే అని అంటున్న వారూ ఉన్నారు. తాను రాసిన ‘బికమింగ్’ అనే పుస్తకం ప్రచారంలో భాగంగా మీడియాకు ఇంటర్య్వూ ఇచ్చిన సందర్భంగా మిచెల్ పసుపు రంగు దుస్తులు ధరించి ‘హోలోగ్రాఫిక్ థై హై’ బూట్లు ధరించారు. వివిధ రంగుల్లో మెరుస్తూ ఇవి కనిపించడం హైలైట్‌గా నిలిచింది. ఇంటర్వ్యూ సందర్భంగా మీడియా ప్రతినిధులు షూస్ గురించి అడిగారు. ‘చూడగానే క్యూట్‌గా అనిపించాయి. వెంటనే డిజైన్‌కు ఆర్డరిచ్చాను’ అని మిచెల్ సమాధానం ఇచ్చారు.