బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజే పుట్టాను: హీరో రానా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలకృష్ణ సినిమా రిలీజ్ రోజే పుట్టాను: హీరో రానా

  • చంద్రబాబు నాయుడు రోల్ చేస్తానని అనుకోలేదు
  • క్రిష్ తో ఇంతకుముందు ఒక సినిమా చేశాను 
  • నేను చూసిన ఫస్టు షూటింగ్ బాలకృష్ణగారిదే  
నందమూరి అభిమానులందరినీ ఆనందింపజేసేదిగా నిన్నరాత్రి ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక జరిగింది. ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలను పోషించిన నటీనటులు ఈ వేదికపై మాట్లాడారు. ఈ సినిమాలో చంద్రబాబు నాయుడు పాత్రను పోషించిన రానా మాట్లాడుతూ .."భల్లాల దేవుడు తరువాత చంద్రబాబు నాయుడు పాత్రను పోషిస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. క్రిష్ .. బాలకృష్ణ గారి వల్లనే ఈ పాత్రను చేశాను.

క్రిష్ తో కలిసి ఇంతకుముందు 'కృష్ణంవందే జగద్గురుమ్' చేశాను. ఆ క్రియేటివ్ జర్నీ ఎన్టీఆర్ బయోపిక్ వరకూ వచ్చింది. మీ అందరికీ తెలియని ఒక విషయం చెబుతాను .. నేను పుట్టింది డిసెంబర్ 14 .. బాలకృష్ణగారి 'కథానాయకుడు' రిలీజ్ రోజునే పుట్టాను. నా జీవితంలో నేను చూసిన మొట్టమొదటి సినిమా షూటింగు కూడా బాలకృష్ణగారిదే. ఆయన 'రాము' సినిమా షూటింగ్ మా ఇంట్లోనే జరిగింది. ఇలా బాలకృష్ణగారికి .. నాకు మధ్య ఒక అవినాభావ సంబంధం వుంది" అని చెప్పుకొచ్చాడు. 
balakrishna
raana

More Telugu News