శామీర్ పేటలో అర్ధరాత్రి రేవ్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శామీర్ పేటలో అర్ధరాత్రి రేవ్ పార్టీ.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పోలీసులు!

  • రేవ్ పార్టీలో ఏడుగురు వైద్యులు
  • వీరంతా గజ్వేల్ కు చెందినవారే
  • నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్‌లో జరుగుతున్న రేవ్ పార్టీని పోలీసులు భగ్నం చేశారు. రేప్ పార్టీపై పక్కా సమాచారం అందుకుని దాడిచేసిన పోలీసులు అందులో పాల్గొంటున్న వారంతా డాక్టర్లే అని తేలడంతో తొలుత విస్తుపోయారు. అనంతరం నిందితులను అరెస్ట్ చేశారు. స్థానిక సెలబ్రిటీ రిసార్ట్ లో రేవ్ పార్టీ సాగుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది.

దీంతో రంగంలోకి దిగిన ఎస్ వోటీ పోలీసులు.. రిసార్ట్ లో రేవ్ పార్టీ నిర్వహిస్తున్న ఏడుగురిని ఈరోజు తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. వీరంతా వైద్యులే అని తెలిసి అధికారులు విస్తుపోయారు. ఈ సందర్భంగా నలుగురు యువతులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిని స్టేట్ హోంకు తరలించారు.

మరోవైపు నిందితులను ఈరోజు కోర్టు ముందు హాజరుపర్చనున్నారు. కాగా, రేవ్ పార్టీకి వచ్చిన యువతులకు హెచ్ఐవీ పరీక్షలు చేసిన కిట్లను పోలీసులు ఘటనాస్థలంలో స్వాధీనం చేసుకున్నారు. రేవ్ పార్టీలో పాల్గొంటున్న వైద్యులంతా గజ్వేల్ కు చెందినవారని వ్యాఖ్యానించారు.
Telangana
Jogulamba Gadwal District

More Telugu News