Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బాలయ్యతో సినిమా 'సింహా', 'లెజెండ్' లను మించి ఉంటుంది: బోయపాటి

  • బాలకృష్ణ నెక్స్ట్ మూవీ బోయపాటితో 
  • ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు 
  • ప్రస్తుతానికి వినాయక్ తో సినిమా లేనట్టే    
బాలకృష్ణ ప్రధాన పాత్రధారిగా ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతోంది. క్రిష్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకి కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. నిన్న రాత్రి ఈ సినిమా ఆడియో వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. బాలకృష్ణ తదుపరి సినిమా బోయపాటితో వుంటుందనే విషయాన్ని ఈ వేదికపైనే ప్రకటించారు. ఈ ప్రాజెక్టును గురించి బోయపాటి మాట్లాడారు.

"బాలకృష్ణ గారితో హ్యాట్రిక్ మూవీ చేయబోతున్నాను. గతంలో మా కాంబినేషన్లో వచ్చిన 'సింహా' .. 'లెజెండ్' ఏ స్థాయి విజయాలను అందుకున్నాయనేది తెలిసిందే. ఈ సారి చేయనున్న సినిమా ఆ రెండు సినిమాలకి మించి ఉంటుందని అభిమానులకు మాట ఇస్తున్నాను. ఫిబ్రవరిలో సెట్స్ పైకి వెళుతున్నాము .. మిగతా వివరాలు త్వరలోనే తెలియజేస్తాము" అని అన్నారు. దాంతో ఎన్టీఆర్ బయోపిక్ తరువాత బాలకృష్ణ సినిమా వినాయక్ తో ఉంటుందంటూ జరుగుతోన్న ప్రచారానికి తెరపడిపోయింది. 
balakrishna
Boyapati Sreenu

More Telugu News