టీచర్లు, పోలీసుల పదోన్నతులకు ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
- చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ మీట్
- కొత్త మంత్రుల పేషీలో 16 పోస్టుల మంజూరుకు గ్రీన్ సిగ్నల్
- ఆదరణ పథకం సబ్సిడీ 90 శాతానికి పెంపు
ఆదరణ-2 కార్యక్రమం కింద పొందుతున్న సబ్సిడీని 70 శాతం నుంచి 90 శాతానికి పెంచుతూ మంత్రిమండలిలో నిర్ణయం తీసుకున్నారు. 20 శాతం అదనపు సబ్సిడీ వల్ల ప్రభుత్వంపై రూ.195 కోట్ల భారం పడుతుంది. అయితే, 8 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుతుందనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చంద్రబాబు తెలిపారు.