Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చరిత్రకు జయాలు, అపజయాలు ఉండవు.. చరిత్ర సృష్టించడమే ఉంటుంది: జూనియర్ ఎన్టీఆర్

  • తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్
  • ఎన్టీఆర్ ది ఓ చరిత్ర..
  • ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైంది
ఆ మహామనిషి కుటుంబంలోని ఒక కుటుంబసభ్యుడిగా తాను మాట్లాడటం లేదని, ఒక మహానుభావుడు చేసిన త్యాగాల వల్ల లబ్ధి పొందిన ఒక తెలుగువాడిగా తాను మాట్లాడుతున్నానని ప్రముఖ హీరో జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ లోని తొలి భాగం ‘కథానాయకుడు’ ఆడియో విడుదల సందర్భంగా జరుగుతున్న కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఇంటికీ చెందిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు.

ఆ మహానుభావుడి చరిత్రను మా తరానికి, ముందు తరాలకు తీసుకెళ్తున్న బాబాయ్ బాలకృష్ణ గురించి ఎంత చెప్పినా సరిపోదంటూ భావోద్వేగం చెందారు. ఎన్టీఆర్ ది ఓ చరిత్ర అని, ఇటువంటి చరిత్రను భావితరాలకు అందిస్తున్నందుకు ఇది విజయం సాధించాలని తాను కోరుకోనని, ఎందుకంటే, ఎన్టీఆర్ విజయం సాధించడం వల్లే ఈ బయోపిక్ మొదలైందని, చరిత్రకు విజయాలు, అపజయాలు ఉండవని, కేవలం చరిత్ర సృష్టించడమే ఉంటుందని అన్నారు.
NTR BIOPIC
Balakrishna
Junior Ntr

More Telugu News