మా నాన్నను గుర్తుతెచ్చేలా బాలకృష్ణ ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఉన్నాయి: పురందేశ్వరి

  • ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై కెక్కించడం సాహసమే
  • మా వంశానికే కాదు తెలుగు ప్రజలకే ఖ్యాతి తెచ్చారు
  • ఈ చిత్రం విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా
నందమూరి వంశానికే కాదు తెలుగు ప్రజలకు, జాతికి ఖ్యాతి తెచ్చిన మహానాయకుడు ఎన్టీఆర్ అని బీజేపీ నేత, ఆయన కుమార్తె దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకలో ఆమె మాట్లాడుతూ, ఎన్టీఆర్ జీవితాన్ని తెరపైకి తీసుకురావడమనేది నిజంగా సాహసోపేతమైందని భావిస్తానని అన్నారు.

తన తండ్రి పాత్రలో తమ్ముడు బాలకృష్ణ నటించడానికి చేసిన సాహసానికి అతన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు. ఈ బయోపిక్ టీజర్స్ చూస్తే తన తండ్రిని గుర్తుతెచ్చేలా బాలకృష్ణ ఆహార్యం, డైలాగ్ డెలివరీ ఉన్నాయని ప్రశంసించారు. అదేవిధంగా, తన తల్లి పాత్రను పోషించిన విద్యాబాలన్ కు, దర్శకుడు క్రిష్ కు అభినందనలు తెలియజేస్తున్నానని, ఈ చిత్రం విజయం సాధించాలని కోరుకుంటున్నానని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Balakrishna
NTR biopic
bjp
purandeswari

More Telugu News