సమంతకి కొడుకు పాత్రలో రావు రమేశ్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సమంతకి కొడుకు పాత్రలో రావు రమేశ్!

  • కొరియన్ మూవీగా 'మిస్ గ్రానీ'
  • తెలుగు రీమేక్ టైటిల్ గా 'ఓ బేబీ'
  • వృద్ధురాలి పాత్రలో సమంత
ఇటీవల కాలంలో విభిన్నమైన కథలు .. నటనకి ప్రాధాన్యత కలిగిన పాత్రలనే సమంత ఎంచుకుంటూ వస్తోంది. తాజాగా ఆమె వైవిధ్యభరితమైన మరో కథలో కనిపించడానికి సిద్ధమవుతోంది. సమంత ప్రధాన పాత్రధారిగా నందినీ రెడ్డి ఒక సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. కొరియన్ భాషలో తెరకెక్కిన 'మిస్ గ్రానీ' సినిమాకి ఇది రీమేక్. తెలుగులో ఈ సినిమాకి 'ఓ బేబీ' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.ఈ సినిమాలో సమంత 70 యేళ్ల వృద్ధురాలి పాత్రలో కనిపించనుందని అంటున్నారు. 70 యేళ్ల ఈ వృద్ధురాలు .. తాను 20 యేళ్ల యువతిగా మారిపోతే ఎలా ఉంటుంది? తనకి 50 యేళ్ల కొడుకు ఉంటే ఎలా ఉంటుంది? అని కలలుకంటూ ఉంటుందట. ఈ నేపథ్యంలోనే ఆమె కొడుకు పాత్రలో రావు రమేశ్ కనిపించనున్నాడని చెబుతున్నారు. ఇంతవరకూ రావు రమేశ్ చేసిన పాత్రలకి ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. సమంత .. రావు రమేశ్ కాంబినేషన్లో వచ్చే సీన్స్ ఇంట్రెస్టింగ్ గా వుంటాయని చెబుతున్నారు. 
samanta

More Telugu News