జగన్ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి: చంద్రబాబు

  • నేడు జగన్ పుట్టినరోజు
  • వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు
  • గ్రీటింగ్స్ తెలిపిన చంద్రబాబు, కవిత
వైసీపీ అధినేత జగన్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. జగన్ కు ఆరోగ్యం, సంతోషాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుతున్నానని తెలిపారు.

టీఆర్ఎస్ ఎంపీ కవిత కూడా జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. 'జగన్ అన్నా... మీరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి' అంటూ ఆమె ట్వీట్ చేశారు. 
Go Back to Shorts
Chandrababu
jagan
kavitha

More Telugu News