Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'ఎన్టీఆర్' గెటప్స్ చూసి బాలకృష్ణను అభినందించిన కృష్ణ!

  • ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుక 
  • ఆహ్వానించడానికి వెళ్లిన బాలకృష్ణ 
  • అభినందించిన కృష్ణ
ఎన్టీఆర్ బయోపిక్ ఆడియో వేడుకను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ .. ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో వైభవంగా జరపనున్నారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణను ఆహ్వానించడానికి ఆయన ఇంటికి బాలకృష్ణ వెళ్లారు. ఆ సమయంలో సీనియర్ నరేశ్ కూడా అక్కడే వున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ విశేషాలను గురించి కృష్ణతో బాలకృష్ణ ముచ్చటించారు. ఈ సినిమాలో తాను ధరించిన వివిధ రకాల గెటప్స్ ను తన సెల్ ఫోన్లో కృష్ణకి బాలకృష్ణ చూపించారు.

అందుకు సంబంధించిన ఫోటోలను సీనియర్ నరేశ్ ట్వీట్ చేస్తూ, "ఎన్టీఆర్ గా వివిధ కోణాల్లో బాలకృష్ణ గెటప్స్ చూసి కృష్ణగారు ఫిదా అయ్యారు. కచ్చితంగా ఇది తెలుగు సినీ చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు" అని అన్నారు. ఎన్టీఆర్ .. కృష్ణల మధ్య మంచి సాన్నిహిత్యం వుంది .. ఎన్టీఆర్ తో కలసి నటించడమే కాకుండా, కృష్ణ కొన్ని చిత్రాలను నిర్మించిన సంగతి కూడా తెలిసిందే. 
krishna
balakrishna

More Telugu News