రాజమౌళి సినిమా కోసం రామ్ చరణ్ భారీ డీల్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజమౌళి సినిమా కోసం రామ్ చరణ్ భారీ డీల్?

  • సంక్రాంతికి 'వినయ విధేయ రామ'
  • సెట్స్ పై రాజమౌళి మల్టీస్టారర్ 
  • రెండు సినిమాలకి డీవీవీ దానయ్య నిర్మాత
బోయపాటి దర్శకత్వంలో చరణ్ 'వినయ విధేయ రామ' సినిమా చేశాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక చరణ్ తన తదుపరి చిత్రాన్ని రాజమౌళి దర్శకత్వంలో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రెండు భారీ సినిమాలకి డీవీవీ దానయ్య నిర్మాత. ఆయనతో చరణ్ ఒక భారీ డీల్ కుదుర్చుకున్నట్టుగా ఒక వార్త ఫిల్మ్ నగర్లో షికారు చేస్తోంది.

చరణ్ తన క్రేజ్ కి తగినట్టుగా ఒక్కో సినిమాకి 18 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నట్టు వినికిడి. 'వినయ విధేయ రామ' సినిమాకి సంబంధించిన తన పారితోషికాన్ని .. రాజమౌళి సినిమాకి సంబంధించిన తన పారితోషికాన్ని రాజమౌళి సినిమాలో తన పెట్టుబడిగా భావించమని నిర్మాతతో చరణ్ ఒక డీల్ కుదుర్చుకున్నాడట. అందుకు దానయ్య కూడా అంగీకరించినట్టుగా సమాచారం. చరణ్ చాలా తెలివిగానే ప్లాన్ చేశాడనీ, రాజమౌళి సినిమాకి లాభాలు వస్తే తన వాటాగా చరణ్ కి భారీ మొత్తమే ముడుతుందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
charan
danayya

More Telugu News